Citrus Fruits : సిట్రస్ పండ్లలో నిమ్మకాయలు, ద్రాక్షపండు మరియు నారింజ వంటి అనేక రకాల పండ్లు ఉన్నాయి. నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు మరియు నారింజలలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి కూడా నిమ్మజాతి పండ్ల నుంచి పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు మీ శరీరాన్ని రక్షించడంలో మరియు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఇది మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమైన తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి మీ రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. సిట్రస్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్‌తో సహా ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఫ్లేవనాయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. 2014 అధ్యయనం ప్రకారం, మూత్రంలో తక్కువ మొత్తంలో సిట్రేట్ ఉన్న వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్లను అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సిట్రస్ పండ్లు సిట్రేట్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా నిమ్మజాతి పండ్లు నిత్యం తీసుకోవడం వలన మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి.
నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్ సి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన పోషకం. ఇది మీ చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.విటమిన్ సి ఎక్కువగా తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మం వృద్ధాప్య చాయలను దరిచేరనివ్వదు. సిట్రస్ పండ్లలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక సమ్మేళనాలు ఉన్నాయి.
సిట్రస్ పండ్లలో ఉండే ఫైబర్ మరియు ఫ్లేవనాయిడ్లు ఆరోగ్యకరమైన HDL కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా హానికరమైన LDL కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించవచ్చు. నిమ్మజాతి పండ్లు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. నిమ్మజాతి పండ్లలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.