హెల్త్ టిప్స్

ఇన్ని రోజుల నుంచి మ‌నం నీళ్ల‌ను త‌ప్పుగా తాగుతున్నామ‌ని మీకు తెలుసా..? నీళ్ల‌ను అస‌లు ఎలా తాగాలి..?

ఈ విష‌యము చాలా మందికి తెలిసే ఉండచ్చు కానీ 96–97 % మంది ఇదే తప్పు విధానాన్నే పాటిస్తారు కాబట్టి ఇది తెలియని విషయము కిందనే వస్తుంది. మంచినీరు గ్లాసు పెడితే గుటుకు గుటుకు అని ఆపకుండా టక టకా తడబడకుండా 10 సెకండ్లలో తాగేస్తారు. అలా తాగితే కడుపు నిండిపోతుంది రెండో గ్లాసు తాగుదాము అని అనుకున్నా పొట్ట పట్టదు . అదే మంచినిరు టీనో, కాఫీలానో 40–50 సెకండ్ ల పాటు నెమ్మదిగా తక్కువ తక్కువగా తాగితే మీ కడుపు నిండదు . రెండవ గ్లాసు కూడా తాగగలరు . ఆ రెండవ గ్లాసు కూడా ఇలా నెమ్మదిగా తాగితే 1–2 నిమిషాల తర్వాత మూడవ గ్లాసు కూడా తాగగలరు . ఇలా 5–10 నిమిషాలలో మూడు గ్లాసులు తాగినా మీ కడుపు అసలు నిండదు. దీని గురించి సద్గురు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఒక‌ సారే గుటుకు గుటుకు అని తాగేస్తే మీ కడుపు నిండిపోయి ఆ తర్వాత మీరు పరిగెట్టలేరు. పరిగేటప్పుడు మీ పొట్టలో నొప్పి అనిపిస్తుంది ఇంక పరిగెట్టటము ఆపేయాలి అనిపిస్తుంది. అదే పైన చెప్పినట్టు టీనో కాఫీలానో నెమ్మదిగా 3 గ్లాసులు తాగినా అలా పొట్ట నిండిపోయినట్టు అనిపియదు ఎక్కువ సేపు కూడా పరిగెట్టగలరు. చాలా మంది ఆటగాళ్ళు ఈ విధానాన్ని పాటిస్తారు . మీరు దీనిని టీవీలో చూసినప్పుడు గమనించవచ్చు. ఇది అన్ని రకాల ఆహారాలకు వర్తిస్తుంది. ఒక 90+ కేజిలు ఉండే వ్యక్తిని అర లీటర్ పాలు 30 నిమిషాలలో తాగమంటే తాగగలడు అదే అర లీటర్ పాలు 40+ కేజీలవాడిని 30 నిమిషాలలో తాగమంటేే తాగలేడు కానీ ఇద్దరిని 24 గంటలలో అదే అర లీటర్ పాలు తాగమంటే చాలా తేలికగా తాగగలరు.

do you know that we are drinking water wrongly

ఈ విషయం గురించి అందరికీ తెలిసినా 96–97% మంది అలాగే మంచినీరును తాగుతారు. కాబట్టి ఈ అలవాటును మార్చుకుని మీరే తేడాను గమనించవచ్చు.

Admin

Recent Posts