హెల్త్ టిప్స్

టీ తాగితే అలా అవుతారనేది పచ్చి అబద్దం…!

టీ’ అసలు ఉదయం లేవడం లేవడమే కొందరికి దీనితోనే జీవితం ప్రారంభమవుతుంది. రోజులో గంటకు ఒకసారి టీ తాగే ప్రబుద్దులు కూడా ఉన్నారు. వద్దు అంటే ఫీల్ అవుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. అయితే టీ తాగడం వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఏదైనా పరిమితంగా చేస్తే తప్పు లేదు గాని అతిగా చేస్తేనే లేనిపోని సమస్యలు అన్ని వస్తు ఉంటాయి.

టీ తాగడం వలన కొందరికి ఒక అపోహ ఉంటుంది. నల్లగా అవుతారు అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. కాని అది నిజం కాదని అంటున్నారు. చర్మం ఆకృతి, రూపు రేఖలపైన మాత్రమే రంగు ఆధారపడి ఉంటుంది గాని, మన చర్మ౦ రంగు మారడానికి టీ మాత్రం ఏ విధంగా చూసినా సరే కారణం కానే కాదు అంటున్నారు వైద్యులు. అసలు ఆ అపోహ ఏ విధంగా పుట్టిందో కూడా తెలియదు అంటున్నారు.

does drinking tea changes skin color

టీ, కాఫీ లేదా కెఫిన్ అధికంగా ఉండే ద్రావణాలు చర్మ రంగు ని ఏ విధంగాను ప్రభావితం చేసే అవకాశం ఉండదని వాళ్ళు అంటున్నారు. ఎక్కువ సార్లు తాగితే చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే ఓవర్ గా తాగే వారికి మాత్రం చర్మం నల్లబడే అవకాశాలు కాస్తో కూస్తో ఉన్నాయి గాని రోజుకి రెండు మూడు సార్లు తాగే వారికి వచ్చే సమస్యలు ఏవీ లేవని, ఎందుకైనా మంచిది కాస్త తక్కువ తాగండి అంటున్నారు.

Admin

Recent Posts