Dried Cranberries For Gas Trouble : ఆహారం విషయంలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకూడదు. మంచి ఆహారాన్ని తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. పైగా సరైన టైం కి ఆహారం తీసుకోకపోవడం వలన, జంక్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవడం వలన, అనేక ఇబ్బందులు వస్తాయి. అలానే, ఒత్తిడి వంటి కారణాల వలన, పొట్టకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి ఇలా ఈ సమస్యల నుండి బయట పడాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే, ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, పొట్టలో నొప్పి ఇలాంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే, క్రాన్ బెర్రీస్ బాగా సహాయం చేస్తాయి.
ఇవి మనకి ఆన్లైన్ లో కానీ, డ్రైఫ్రూట్లో అమ్మే దుకాణాల్లో కానీ దొరుకుతాయి. క్రాన్ బెర్రీస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్రాన్ బెర్రీస్ తీసుకుంటే, ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు. క్రాన్ బెర్రీస్ లో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ తో పాటుగా విటమిన్ కే, బి సిక్స్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ లభిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలకి చెక్ పెట్టడానికి ఇవి మనకి బాగా సహాయం చేస్తాయి.
అంతేకాదు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవాళ్లు తీసుకుంటే, ఉపశమనం కలుగుతుంది. మూత్ర నాళాలలో హానికరమైన సూక్ష్మ జీవుల నుండి రక్షణ, మనకి ఇవి కల్పిస్తాయి. శరీరంలో వైరస్లు వ్యాపించకుండా, చూసుకుంటాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో, రెండు స్పూన్లు క్రాన్ బెర్రీస్ ని వేసి, ఐదు నుండి ఏడు నిమిషాల దాకా మరిగించుకోవాలి.
బాగా మరిగిన తరవాత, వడకట్టుకుని గోరువెచ్చగా తీసుకోవాలి. కావాలంటే, కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు. ఏడు రోజులు పాటు, ఇలా తాగితే, యూరిన్ ఇన్ఫెక్షన్, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి బాధలు ఉండవు. నీళ్లు తాగేసి కావాలంటే, ఉడికించిన క్రాన్ బెర్రీస్ ని తినవచ్చు. కీళ్లు, ఎముకలు నొప్పి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడొచ్చు.