Coconut Water : వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు శీతల పానీయాలు తాగుతుంటారు. ఇక చాలా మంది కొబ్బరి నీళ్లను కూడా తాగుతుంటారు. అయితే ఈ సీజన్ లో మాత్రం కొబ్బరి నీళ్లను ఉదయాన్నే తాగాలి. అవును.. అలా తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయాన్నే పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండలో తిరిగినా వేడి అనిపించదు. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది. శరీరానికి కావల్సిన అనేక మినరల్స్ ఉదయమే లభిస్తాయి. ఇవన్నీ మన శరీరాన్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి.
2. కొబ్బరి నీళ్లను ఉదయమే తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేయవచ్చు. మెదడు చురుగ్గా ఉండి యాక్టివ్‌గా పనిచేస్తుంది. దీంతో బద్దకం, నిద్ర వంటివి రావు.
3. పరగడుపునే కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరానికి కావల్సినంత పొటాషియం లభిస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
4. కొబ్బరినీళ్లను పరగడుపునే తాగితే ఈ సీజన్‌లో వచ్చే జీర్ణ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
5. కొబ్బరినీళ్లను తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.