Sugarcane Juice : వేసవి కాలం వచ్చేసింది. కాలానికి తగినట్టు మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు రావాలని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల శరీరంలో తగినంత నీరు ఉండి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం తగినంత ఉండాలి. నీటిని, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. కనుక ఒక గ్లాసు చెరుకు రసాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.
చెరుకు రసం తాగడం వల్ల మనకు వెంటనే శక్తి లభిస్తుంది. తల తిరగడం, నీరసం వంటి వాటి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడడంలో చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడే వారికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది.
చెరుకు రసం తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చెరుకు రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును తగ్గిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.
చెరుకు రసం తాగడం వల్ల దంతాలు గట్టి పడతాయి. దీని వల్ల పంటి నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వేసవి కాలంలో ఒక గ్లాస్ చల్లటి చెరుకు రసం తాగడం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి చెరుకు రసం ఎంతో సహాయపడుతుంది. చెరుకు రసం తాగడం వల్ల జీర్ణాశయంలో స్రావాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణాశయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
మహిళలకు చెరుకు రసం ఎంతగానో మేలు చేస్తుంది. చెరుకు రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలను తగ్గిస్తుంది. మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
చెరుకు రసం తాగడం వల్ల సహజ సిద్దమైన పద్దతిలో పోషకాలు మన శరీరానికి అందుతాయి. పచ్చ కామెర్లను, కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు.
చాలా మందికి చెరుకు రసం ఎప్పుడూ తాగాలి అనే సందేహం కలుగుతుంది. చెరుకు రసాన్ని బ్రేక్ ఫాస్ట్ అనంతరం, మధ్యాహ్న భోజనానికి మధ్యలో తాగాలి. లేదా మధ్యాహ్నం భోజనం చేశాక రెండు గంటలు విరామం ఇచ్చి కూడా చెరుకు రసం తాగవచ్చు. దీంతో వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.