Weight Loss Tips : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో క్యారెట్ ఒకటి. దీన్ని ఫ్రెండ్లీ వెజిటబుల్ అని కూడా అంటారు. అన్ని సీజన్లలోనూ మనకు క్యారెట్లు లభిస్తాయి. వీటి రుచి భలేగా ఉంటుంది. క్యారెట్లను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. క్యారెట్లలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చా ? లేదా ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. రోజువారీ ఆహారంలో క్యారెట్ జ్యూస్‌ను చేర్చుకోవడం వల్ల అనేక రకాలుగా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు.
క్యారెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల క్యారెట్ జ్యూస్‌ను తాగితే శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
క్యారెట్లలో విటమిన్లు బి1, బి2, బి6 లు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వులు, ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ముఖ్యంగా పనిచేస్తాయి. అందువల్ల క్యారెట్ జ్యూస్‌ను తాగితే మన శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. క్యారెట్ లలో ఉండే బి విటమిన్ల వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. కండరాల నిర్మాణం జరుగుతుంది. కనుక అధిక బరువును తగ్గించడంలో క్యారెట్లు మేలు చేస్తాయనే చెప్పవచ్చు.
రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాలి. దీని వల్ల క్యారెట్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. క్యారెట్లలో ఉండే ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్‌లు కొవ్వును కరిగిస్తూనే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్లలో విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. క్యాన్సర్లు రాకుండా నిరోధించవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి కనుక రోజూ కచ్చితంగా క్యారెట్ జ్యూస్‌ను తాగాల్సిందే..!