Drinking Water : మన శరీరానికి నీరు ఎంతో అవసరం. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తగినంత నీరు ఉండడం చాలా అవసరం. అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలను, విష పదార్థాలను, మలినాలను తొలగించడంలో కూడా నీరు సహాయపడుతుంది. మన శరీరంలో జరిగే అన్ని రకాల జీవక్రియలు కూడా నీటిపై ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. రోజూ నాలుగు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మంది నీటి గురించి ఒక అపోహను కలిగి ఉన్నారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు.
అయితే నీటిని తాగడం వల్ల మనం నిజంగా బరువు తగ్గవచ్చా.. బరువు తగ్గడంలో నీరు మనకు సహాయపడుతుందా.. ఇది నిజమా.. లేక అపోహన మాత్రమేనా… దీని గురించి నిపుణులు ఏమంటున్నారు .. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా నీటిని తాగడం వల్ల బరువు తగ్గరని.. నీటికి బరువును తగ్గించే స్వభావం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది అపోహ మాత్రమేనని వారు తెలియజేస్తున్నారు. నీటిని బదులుగా మూలికలు, మసాలా దినుసులతో చేసిన టీ లను, కషాయాలను తాగినప్పుడు అలాగే పండ్ల రసాలను తాగినప్పుడు మాత్రమే మనం బరువు తగ్గుతామని వారు చెబుతున్నారు. అలాగే అవసరానికి మంచిన నీటిని తాగడం కూడా మంచిది కాదని వారు చెబుతున్నారు. బరువు తగ్గాలని నీటిని తాగడ వల్ల శరీరంలో నీటి స్థాయిలు ఎక్కువవుతాయి.
దీంతో వాటర్ పాయిజనింగ్ అనే సమస్య బారిన పడతారు. ఈ స్థితిలో శరీరంలో సోడియం స్థాయిలు తక్కువయ్యి మరణం కూడా సంభవించవచ్చు. కనుక మన శరీర అవసరానికి తగినట్టు నీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు భోజనానికి ముందుగా కొద్దిగా నీటిని తాగడం మంచిది. నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. ఈ విధంగా మాత్రమే మనకు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నేరుగా నీటిని తాగలేని వారు నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయ, పుచ్చకాయ, టమాట వంటి వాటిని సలాడ్ రూపంలో తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువ నీటిని తాగడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని అలాగే తగిన మోతాదులో మాత్రమే నీటిని తీసుకోవాలని ఎక్కువగా నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.