Drinking Water : మన పూర్వీకులు రోజూ రాత్రి పడుకునే ముందు మంచం పక్కకు రాగి చంబులో నీటిని పెట్టుకుని నిద్రించే వారు. ఉదయాన్నేపరగడుపున ఈ నీటిని తాగే వారు. ఇలా రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని పరగడుపున తాగడం వల్ల వారు ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా జీవించారని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో మనలో చాలా మంది ఉదయం లేచిన తరువాత పరగడుపున లీటర్నర నీటిని తాగుతూ ఉంటారు. ఇలా పరగడుపున లీటర్నర నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరగడుపున నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడే అవకాశాలు 25 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
1,50,000 వేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. పరగడుపున నీటిని తాగని వారితో పోలిస్తే నీటిని తాగే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వారు 25 శాతం జబ్బుల బారిన తక్కువగా పడుతున్నారని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. కనుక రోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే టీ , కాఫీలకు బదులుగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిని తాగాలని వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగాలని వారు చెబుతున్నారు. అయితే కొందరు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బద్దకించి నీటిని తాగడం మానేస్తూ ఉంటారు.
అలా చేయకుండా క్రమం తప్పకుండా జీవితకాలం పాటు రోజూ ఉదయాన్నే పరగడుపున లీటర్నర నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగలేని వారు 6 నుండి 7 నిమిషాల వ్యవధిలో నీటిని తాగాలని వారు చెబుతున్నారు. సాధారణ నీటి కంటే రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఇలా రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన కాపర్ అందడంతో పాటు నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు కూడా నశిస్తాయి. అలాగే రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా ఇలా నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు అన్నీ కూడా మూత్రం ద్వారా బయటకు పోతాయి. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది. సుఖ విరోచనం అవుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. పరగడుపున నీటిని తాగడం వల్ల మనం బరువు తగ్గే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇలా రోజూ ఉదయం పరగడుపున రాగి పాత్రలో నిల్వ చేసిన తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరిచేరుకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.