Dry Apricots Benefits : డ్రై ఆప్రికాట్ ఆరోగ్యానికి, చాలా మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. ఈ డ్రై ఆప్రికాట్ ని, పొడి కింద చేసుకుని కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది అజీర్తి సమస్యల్ని పోగొడుతుంది. వికారం వంటి సమస్యల్ని కూడా, ఇది దూరం చేస్తుంది. అలానే, ఇతర లాభాలు కూడా వున్నాయి. అవేమిటో కూడా ఇప్పుడే చూసేద్దాం. ఈ డ్రై ఆప్రికాట్ లో క్యాలరీలు బాగా తక్కువగా ఉంటాయి. డ్రై ఆప్రికాట్స్ ని తీసుకోవడం వలన ఎనర్జీని కూడా మనం పెంచుకోవచ్చు.
డ్రై ఆప్రికాట్స్ లో పొటాషియం కూడా బాగా ఉంటుంది. మజిల్ ఫంక్షన్ కి ఆప్రికాట్ బాగా పని చేస్తుంది. అలానే, మజిల్ క్రాంప్స్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఈ డ్రై ఆప్రికాట్స్ ని తీసుకోవడం కూడా మంచిది. ఇక మరి, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఈ డ్రై ఆప్రికాట్స్ ని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వచ్చేస్తే… స్నాక్స్ కింద డ్రై ఆప్రికాట్స్ ని తీసుకోవచ్చు.
డ్రై డ్రై ఆప్రికాట్స్ ని తీసుకోవడం వలన భోజనానికి, భోజనానికి మధ్య క్రేవింగ్స్ ని తీర్చుకో వచ్చు. అలానే, సలాడ్స్, పెరుగులో కూడా డ్రై ఆప్రికాట్స్ ని వేసుకుని తీసుకోవచ్చు. నాచురల్ స్వీట్ నెస్ గా దీనిని వాడుకోవచ్చు. ఏదైనా స్మూతీ వంటివి తయారు చేసినప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకుని, మనం వాడుకోవచ్చు.
డ్రై ఆప్రికాట్స్ వలన, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. కాబట్టి, అప్పుడప్పుడు వీటిని మీరు ఏదైనా ఆహార పదార్థాలతో పాటుగా జోడించి తీసుకో వచ్చు. ఇలా డ్రై ఆప్రికాట్స్ తో మనం చాలా లాభాలని పొంది, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.