Dry Fruits For Sleep : మన శరీరానికి నిద్ర కూడా ఎంతో అవసరం. మనం మన శరీరానికి, అవయవాలకు తగినంత విశ్రాంతిని ఇవ్వడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. శరీరం బలంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణంగా మనం పని చేసేటప్పుడు మన శరీర అవయవాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.
ఇలా అవయవాలు ఎక్కువగా పని చేయడం వల్ల వాటి సామర్థ్యం, శక్తి తగ్గుతుంది. ఈ అవయవాలు తిరిగి పని చేయాలంటే వీటికి విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. రోజూ మనం 6 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీర అవయవాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీంతో మనం తిరిగి ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. కానీ మనలో చాలా రోజూ తగినంతగా నిద్రించడం లేదు. దీంతో అవయవాలకు తగినంత విశ్రాంతి లభించక చాలా మంది ఉత్సాహంగా పని చేసుకోలేకపోతున్నారు. అలాగే సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్లు లోపలికి పోవడం, కళ్లు మూతలు పడడం, ముఖ కవలికలు మారిపోవడం జరుగుతుంది. మెదడు చురుకుగా పని చేయడం మానేస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరతాయి. జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేయడం మానేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ విధంగా నిద్రలేమి మన మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.రెస్ట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మనం ఎంత చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పటికి నిద్రించకపోవడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే మన ఆయుష్షు కూడా తగ్గుతుంది. కనుక మనం ఆహారానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తామో నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు గాఢ నిద్ర పోవాలని వారు చెబుతున్నారు. ఇల రాత్రి పూట గాఢ నిద్ర రావాలంటే సాయంత్రం 7 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో పండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి చక్కగా నిద్రపడుతుంది.