Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను తినే ప‌ద్ధ‌తి ఇది.. వీటిని రోజూ ఇలా తింటే ఎన్నో ప్ర‌యోజనాలు..!

Dry Fruits : డ్రే ఫ్రూట్స్.. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు సైతం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిండెంట్లు, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి క‌దా అని ఈ డ్రై ఫ్రూట్స్ ను చాలా మంది ఇష్టం వ‌చ్చిన‌ట్టు తింటూ ఉంటారు. ఎలా ప‌డితే అలా తిన‌డం వ‌ల్ల మేలు చేయాల్సిన డ్రై ఫ్రూట్స్ మ‌నకు హానిని క‌లిగిస్తాయి. ఇష్టం వ‌చ్చిన‌ట్టు డ్రై ఫ్రూట్స్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

క‌నుక త‌గిన మోతాదులో మాత్ర‌మే వీటిని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను ఎంత మొతాదులో.. ఏ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లో చ‌క్కెర‌లు, అలాగే కొవ్వులు కూడా ఉంటాయి. క‌నుక వీట‌న్నింటిని మ‌నం 20 గ్రాముల మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే వీటిని నేరుగా కూడా తీసుకోకూడ‌దు. డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక వీటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. ఇప్పుడు ఏయే డ్రై ఫ్రూట్స్ ను ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు ఒక‌టి. ఇది మ‌న ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డతాయి.

Dry Fruits this is the way to take them for many benefits
Dry Fruits

రోజూ 4 నుండి 7 బాదంప‌ప్పుల‌ను నాన‌బెట్టి వాటిపై ఉండే పొట్టును తీసి తినాలి. అలాగే వాల్ నట్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. రోజూ 3 నుండి 4 వాల్ న‌ట్స్ ను నాన‌బెట్టి తీసుకోవాలి. అదే విధంగా మ‌నం ఖ‌ర్జూరాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌ధ్య‌స్థంగా ఉండే 2 ఖ‌ర్జూరాల‌ను రోజూ ఆహారంగా తీసుకోవాలి. అలాగే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, బ‌లాన్ని, ప్రోటీన్ల‌ను అందించే వాటిల్లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. వీటిని రోజుకు 20 గ్రాముల మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే మ‌నం జీడిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌నం వారానికి 28 జీడిపప్పుల వ‌ర‌కు తీసుకోవ‌చ్చు.

వీటితో పాటు మ‌నం ఎండుద్రాక్ష‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని మ‌నం రోజుకు గుప్పెడు మోతాదులో తీసుకోవ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అందించే ఆహారాల్లో అవిసె గింజ‌లు కూడా ఒక‌టి. అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని రోజూ రాత్రి ఒక టీ స్పూన్ మోతాదులో పొడిగా చేసుకుని తినాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. అలాగే మ‌నం తినే డ్రై ఫ్రూట్స్ లో గుమ్మ‌డి గింజ‌లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ గుమ్మ‌డి గింజ‌ల‌ను మ‌నం రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌చ్చు. అలాగే పొద్దు తిరుగుడు గింజ‌ల‌ను కూడా రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌చ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందడంతో పాటు ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా క‌ల‌గ‌కుండా ఉంటాయి.

Share
D

Recent Posts