Ear Wax : చెవుల్లో ఏర్పడే వ్యర్ధ పదార్థం గురించి అందరికీ తెలిసిందే. అదేనండీ.. గులిమి. చెవుల్లో అది ఉన్నా లేకున్నా చాలా మంది అస్తమానం చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుతుంటారు. ఇంకా కొందరు అయితే చెవుల్లో అసలు గులిమినే క్లీన్ చేసుకోరు. సరే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. కానీ చెవుల్లో ఏర్పడే గులిమి స్థితిని బట్టి కూడా ఎవరు ఎలాంటి అనారోగ్యంతో బాధ పడుతున్నారో ఇట్టే తెలుసుకోవచ్చట. అవును, మేం చెబుతోంది నిజమే. అయితే గులిమి ఎలా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో ఉండే గులిమి వల్ల అస్తమానం దురద పెడుతూ ఉంటే అప్పుడు అలాంటి వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చెవిలో ఉండే గులిమి కూడా రంగు మారుతుంది. స్థితి కోల్పోతుంది. అయితే యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా గులిమి నల్లగా, పొడిగా ఉంటే అప్పుడు అనుమానించాల్సిందే. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం బెటర్. ఏదైనా పనిచేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చెమట రావడం సహజమే. అయితే చెవుల్లో ఉండే గులిమి చెమట రూపంలో వస్తుంటే అప్పుడు దాన్ని తీవ్రమైన సమస్యగా భావించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. అది తీవ్రమైన చెవి సంబంధ సమస్య అయి ఉండవచ్చు. కనుక అలా గనక ఉంటే నిర్లక్ష్యం చేయరాదు.
చెవుల్లో ఏర్పడే గులిమి ఆరెంజ్ లేదా డార్క్ బ్రౌన్ రంగులో ఉంటుంది. అయితే ఈ రెండు కలర్లు కాకుండా గులిమి ఆకుపచ్చ, పసుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటే అప్పుడు చెవికి ఇన్‌ఫెక్షన్ సోకినట్టు అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను కలవాలి. తగిన వైద్యం పొందాలి. గులిమి అంతా కలసి పోయి ఉండకుండా పొట్టులా ఉంటే అప్పుడు చెవి దురద సమస్య వచ్చినట్టు తెలుసుకోవాలి. తగిన సమయంలో స్పందించి చికిత్స తీసుకోవాలి.
గులిమి దుర్వాసన వస్తుంటే చెవి ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు తెలుసుకోవాలి. వెంటనే తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా చెవిలో గులిమి ఏర్పడుతుంది. ఒక వేళ అలా కాక గులిమి ఏర్పడకపోతే ప్రమాదమే. డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.