అసలే కరోనా సమయం. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాదం పప్పులు, పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో్ ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి నిద్రించే ముందు రెండు లేదా మూడు బాదంపప్పులను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగండి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
1. బాదంపప్పులను తిని పాలను తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
2. బాదంపప్పు, పాలు.. రెండింటిలోనూ కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలసిపోకుండా ఉంటారు. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి బద్దకం ఉండదు. యాక్టివ్‌గా ఉంటారు.
3. మలబద్దకం సమస్య ఉన్నవారు బాదం పప్పును తిని పాలు తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు.
4. బాదంపప్పులను తిని పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి లభించి ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
5. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు బాదంపప్పులను తిని పాలను తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర సరిగ్గా పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365