Cabbage : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ దీంతో కలిగే లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్టరు. ఎందుకంటే క్యాబేజీ వల్ల మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గవచ్చు. జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన వారు అంత సన్నగా ఉండేందుకు కారణం.. క్యాబేజీని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడమే అని చెప్పవచ్చు.
ఒక అధ్యయనం ప్రకారం రోజూ క్యాబేజీని తినడం వల్ల వారంలో సుమారుగా 4.50 కిలోల మేర బరువు తగ్గవచ్చని తేలింది. కనుక క్యాబేజీని అంత తేలిగ్గా తీసుకోరాదు. క్యాబేజీని రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ప్రోటీన్లు, కాల్షియం అత్యధికంగా ఉండే కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కండరాలకు శక్తి లభిస్తుంది.
ఇక బరువు తగ్గేందుకు క్యాబేజీని రోజుకు ఒక కప్పు మోతాదులో అయినా తినాలి. భోజనానికి కనీసం 10 నిమిషాల ముందు దీన్ని ఉడకబెట్టి తినాలి. బాగా నమలాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీరంలో పెద్దగా క్యాలరీలు చేరవు. ఇక శరీరం తన శక్తి కోసం ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీంతో కొవ్వు అంతా కరిగి బరువు తగ్గుతారు. ఇలా క్యాబేజీని తినడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.