Jaggery : ఆరోగ్యానికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. బెల్లాన్ని తీసుకోవడం వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. వంటల్లో కూడా తియ్యటి రుచి రావడానికి, మనం పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడుతూ ఉంటాము. వీలైనంతవరకు, పంచదార కంటే బెల్లాన్ని వాడడమే మంచిది. బెల్లం వలన కలిగే లాభాల గురించి, చాలా మందికి తెలియదు. ప్రతిరోజు చిన్న బెల్లం ముక్కని తింటే, ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో బెల్లాన్ని తీసుకోవడం మంచిది. బెల్లాన్ని వాడటం వలన, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
బెల్లం వాడేటప్పుడు ఏ బెల్లాన్ని పడితే ఆ బెల్లాన్ని వాడకండి. ఏ బెల్లాన్ని పడితే అది కాకుండా ముదురు రంగులో ఉండే, ఆర్గానిక్ బల్లాన్ని వాడడం వలన చక్కటి ఫలితం ఉంటుంది, లేతరంగు బెల్లంలో కెమికల్స్ ని కలుపుతారు, అందుకనే ఆ బెల్లం, లేత రంగులో ఉంటుంది. బెల్లాన్ని కొనేటప్పుడు, ముదురు రంగులో ఉన్నదాన్ని ఎంచుకోండి. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడానికి, బాగా ఉపయోగపడుతుంది.
రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లని దూరం చేసేసి, చర్మానికి మంచి కాంతిని కూడా ఇది ఇస్తుంది. భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్కను తీసుకున్నట్లయితే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా సాగుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు, బెల్లం తీసుకోవడం వలన ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యని తగ్గించేస్తుంది.
బెల్లం తీసుకోవడం వలన జలబు, దగ్గు, రొంప వంటి పాదాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. చూశారు కదా బెల్లం తీసుకోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… మరి రెగ్యులర్ గా, చిన్న బెల్లం ముక్కను తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ సమస్యలు అన్నిటికి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకోవచ్చు.