కోడిగుడ్లంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ లేదా కూరల రూపంలో గుడ్లను తింటుంటారు. కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని ఎంత పడింతే అంత తినకూడదు. అధికంగా కోడిగుడ్లను తినడం వల్ల పలు ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోడిగుడ్లను అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక గుడ్లను అధికంగా తినరాదు.
2. కోడిగుడ్లను మోతాదుకు మించి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
3. కోడిగుడ్లు త్వరగా జీర్ణం కావు. అధికంగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది.
4. కోడిగుడ్లలో సహజసిద్ధమైన కొవ్వులు ఉంటాయి. అయితే మోతాదులో గుడ్లను తింటే ఆ కొవ్వులు మనకు మేలే చేస్తాయి. కానీ గుడ్లను అధికంగా తింటే అవే కొవ్వులు మనకు హాని చేస్తాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. కనుక గుడ్లను మోతాదుకు మించి తినరాదు.
కోడిగుడ్లను అధికంగా తినడం వల్ల ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కనుక వాటిని రోజూ మోతాదులోనే తినాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు తినవచ్చు. ఎక్కువ తినాలని అనుకుంటే గుడ్ల లోపలి పచ్చసొన తీసి తినాలి. ఇక డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు గుడ్లను 2 రోజుకుల ఒకటి చొప్పున తినవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉంటే గుడ్డులోని పచ్చ సొన తీసి తినవచ్చు. ఈ విధంగా గుడ్లను తింటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రయోజనాలను పొందవచ్చు.