Edible Gum : మన చుట్టూ ప్రపంచంలో తినదగిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో చాలా ఆహారాల గురించి మనకు తెలియదు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ ఆహారం గురించే. దాన్నే ఎడిబుల్ గమ్ అంటారు. అదేంటీ.. గమ్‌ను తింటారా.. అంటే.. అవును.. ఈ గమ్‌ను అయితే తింటారు. దీన్ని అకేషియా వృక్షాల నుంచి తీస్తారు. దీన్ని తినవచ్చు. దీన్ని ఈ సీజన్‌లోనే కాదు.. ఏ సీజన్‌లో అయినా సరే రోజూ ఇంత తింటే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఎడిబుల్ గమ్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడిబుల్ గమ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఈ గమ్‌ను కాస్త తిన్నా చాలు.. సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అలాగే జీర్ణాశయం పనితీరు మెరుగు పడుతుంది. ఈ గమ్‌ను కాస్త తిన్నా చాలు.. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ గమ్ ఎంతగానో మేలు చేస్తుంది. ఈ గమ్‌ను తినడం వల్ల ఆకలి నియంత్రణలోకి వస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
ఎడిబుల్ గమ్‌ను తినడం వల్ల జీర్ణవ్యవస్థకు కావల్సిన ప్రీబయోటిక్స్ లభిస్తాయి. వీటినే మంచి బాక్టీరియా అంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఈ గమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇది ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ గమ్‌ను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎడిబుల్ గమ్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంటే ఇతర ఆహారాలతో దీన్ని కలిపినప్పుడు వాటికి చెందిన రూపం, రంగు, రుచి మారుతాయి. అవి ఎంతో ఆకర్షణీయంగా కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి. దీంతో ఆ ఆహారాలను ఎక్కువగా తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అందుకనే దీన్ని బేకరీ ఆహారాలు, శీతల పానీయాలు, ఇతర చిరుతిళ్లలో కలుపుతారు. దీంతో అవి కళ్లకు ఆకర్షణీయంగా కనబడి మనకు నోరూరింపజేస్తాయి. ఇలా ఎడిబుల్ గమ్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇది అందరికీ పడకపోవచ్చు. కనుక డాక్టర్ సలహా మేరకు వాడుకోవడం మంచిది. లేదంటే దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.