Fennel Powder : సాధారణంగా మనలో చాలా మంది భోజనం చేసిన అనంతరం సోంపును తింటుంటారు. దీన్ని తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అయితే సోంపు గింజలను పొడి చేసి పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. దీంతోనూ మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలతో పోలిస్తే వాటి పొడితోనే మనం ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల పొడితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ పొడిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. ఇవి నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. సోంపు గింజల పొడిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని భోజనం అనంతరం తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఈ పొడిలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవు. క్యాన్సర్ ఉన్నవారికి ఇది మేలు చేసే అంశం. ఈ పొడిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక రోగాలు రావు. అలాగే అనాల్జెసిక్ గుణాలు సైతం ఉంటాయి. ఇది నొప్పులకు మేలు చేస్తుంది. ఈ పొడిలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సోంపు గింజల పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు.. బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలను త్వరగా తగ్గిస్తుంది. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ పొడిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. లివర్లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్ శుభ్రంగా మారుతుంది. కామెర్లు ఉన్నవారికి ఈ పొడి మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే కామెర్లు త్వరగా తగ్గుతాయి. ఈ పొడిని తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండి చక్కగా నిద్ర పడుతుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా సోంపు గింజల పొడితో ఎన్నో లాభాలు ఉంటాయి. కనుక దీన్ని రోజూ మరిచిపోకుండా తినాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.