Fennel Seeds Water : మనలో చాలా మంది భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటూ ఉంటారు. సోంపు గింజలను తినడం వల్ల నోరు శుభ్రపడుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు. కానీ సోంపు గింజలను తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సోంపు గింజలు చక్కటి వాసనతో పాటు రుచిని కూడా కలిగి ఉంటాయి. పిల్లలు, పెద్దలు వీటిని తినడానికి ఇష్టపడతారు. సోంపు గింజల్లో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. సోంపు గింజలను నేరుగా తినడంతో పాటు వీటితో చేసిన నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజల నీరు రిఫ్రెషింగ్ పానీయంగా పని చేయడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు నిండుగా భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు గింజల నీరు మనకు ఎంతగానో సహాయపడుతుంది. సోంపు గింజల నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. సోంపు గింజల నీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ నీటిని తాగడం వల్ల ఆకలి ఎక్కువగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సోంపు గింజల నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఫ్లూ, జలుబు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో ఈ నీరు మనకు ఎంతో దోహదపడుతుంది. అదే విధంగా సోంపు గింజలల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. సోంపు గింజలతో చేసిన నీటిని తాగడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సోంపు గింజల నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. మధుమేహం లేదా ఫ్రీడయాబెటిక్ లక్షణాలతో బాధపడే వారు సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీలు సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యం నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. గర్భాశయ కండరాలను సడలించి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించే సోంపు గింజలకు ఉంది.
కనుక స్త్రీలు క్రమం తప్పకుండా సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ నీటిని తాగడం వల్ల చాలా సమయం వరకు నోరు తాజాగా ఉంటుంది. సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గడంతో పాటు వృద్దాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా సోంపు గింజల నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.