Fenugreek Seeds And Cinnamon : ఈ మూడు పదార్థాలను క్రమం తప్పకుండా వాడితే ఎంతో కాలంగా వేధిస్తున్న కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఉండే నొప్పులన్నీ తగ్గుతాయి. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి. మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం తీసుకోవాల్సిన వాటిలో మొదటిది మెంతులు. ఇవి మనందరికి తెలిసినవే. ప్రతి ఒక్కరి వంటింట్లో మెంతులు ఉంటాయనే చెప్పవచ్చు. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరంలో యాసిడ్ శాతాన్ని తగ్గించడంలో, రక్తహీనతను తగ్గించడంలో మెంతులు మనకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే రసాయనాల సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి.
అలాగే శరీరంలో వాతం పెరిగిపోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. వాతం పెరిగిపోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ మెంతులను తప్పకుండా తీసుకోవాలి. మెంతులు ఒక పెయిన్ కిల్లర్ లాగా పని చేసి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మెంతులు దోహదపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతులను మనం నానబెట్టి తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. వేసవి కాలంలో లేదా వేడి శరీరతత్వం ఉన్న వారు అర టీ స్పూన్ మెంతులను మాత్రమే ఉపయోగించాలి. ఇలా నానబెట్టిన మెంతులను నీటితో సహా గిన్నెలో వేసి వేడి చేయాలి.
తరువాత ఈ నీటిని తాగి మెంతులను నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం దాల్చిన చెక్క. మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో, బరువు తగ్గడంలో దాల్చిన చెక్క ఎంతో సహాయపడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో, శరీరంలో ఎక్కువగా ఉన్న వాతాన్ని తగ్గించడంలో,ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో, కాళ్లు మరియు చేతుల్లో తిమ్మిర్లు రావడాన్ని తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా దాల్చిన చెక్క మనకు సహాయపడుతుంది.
ఈ దాల్చిన చెక్కను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేయడానికి అరగంట ముందు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి లేదా దాల్చిన చెక్కతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇక మనం తీసుకోవాల్సిన మూడో పదార్థం వెల్లుల్లి రెబ్బలు. మనం వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నా సంగతి మనకు తెలిసిందే. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తాన్న పలుచగా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, అలాగే శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక విధాలుగా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.
శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో, కండరాల నొప్పులను తగ్గించడంలో, గుండె సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి. వీటిని పచ్చిగా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను రోజూ ఉదయం పరగడుపున తేనెతో కలిపి నమిలి తినాలి. అయితే షుగర్ తో బాధపడే వారు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా వెల్లుల్లి రెబ్బలను తినేసి ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఈ విధంగా ఈ మూడు పదార్థాలను 20 నుండి 25 రోజుల పాటు తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చు. వీటిని పైన చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.