Fenugreek Sprouts : మారుతున్న జీవనశైలిని బట్టి ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం. మనం చెప్పుకునే ఆహారాల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులలో ఎన్నో రకాల పోషక విలువలు, ప్రయోజనాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి అందువల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా మొలకెత్తిన మెంతులను తింటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఒక బౌల్ లో మూడు టీస్పూన్ల మెంతులను వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మెంతులు మునిగే విధంగా నీరు పోసుకొని ఒక రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతుల నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన ఉంచుకోండి. నీటిలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ నీటిని అనవసరంగా పారవేయకుండా తాగడం ఎంతో ఉత్తమం. ఇప్పుడు మెంతులు తీసుకొని శుభ్రమైన క్లాత్ లో మూట కట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం కల్లా మెంతుల్లో మొలకలు రావడం ప్రారంభమవుతుంది. సాయంత్రమయ్యేసరికి మెంతుల్లో పూర్తి మొలకలు బయటకు వస్తాయి.
ఇలా మొలకెత్తిన మెంతులను రోజూ ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. మొలకెత్తిన మెంతులలో అమైనో ఆమ్లాలు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ద్వారా డయాబెటిస్ ని అదుపులో ఉంచుతాయి. అదే విధంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి కూడా మెంతులు ఎంతో మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉండే భావనని కల్పించడం ద్వారా ఎక్కువ సమయం ఆకలిని నియంత్రిస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి అధిక బరువును అదుపులో ఉంచటంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతాయి. మెంతుల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అదేవిధంగా నెలసరి కడుపు నొప్పితో బాధపడేవారికి కూడా మెంతులు ఎంతో మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.