High BP : ఈ 3 సింపుల్ స్టెప్స్‌ను పాటిస్తే చాలు.. హైబీపీకి గుడ్ బై చెప్ప‌వ‌చ్చు..!

High BP : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి. వ‌య‌సుతో నిమ్మిత్తం లేకుండా ఇది అంద‌రిని బాధిస్తుంది. మారిన మ‌న జీవన విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బీపీ బారిన ప‌డుతున్నారు. బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా మంది మందులు వాడే అవ‌స‌రం లేకుండా బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తూఉంటారు. అయితే మ‌న జీవ‌న విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల అలాగే మ‌న జీవ‌న విధానంలో మార్పు చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా స‌హ‌జంగా బీపీని త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ రాకుండా ఉండ‌డ‌మే కాకుండా బీపీ కూడా క్ర‌మంగా అదుపులోకి వ‌స్తుంద‌ని మ‌నం వాడే మందుల వాడ‌కాన్ని క్ర‌మంగా త‌గ్గించ‌వచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే బీపీని స‌హ‌జంగా ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంట‌ల్లో రుచి కొర‌కు మ‌నం ఉప్పును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాము. కానీ ఉప్పే బీపీకి ప్ర‌ధాన శ‌త్రువ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ 10 నుండి 25 గ్రాముల ఉప్పును మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాము. ఇలా శ‌రీరంలోకి చేరిన ఉప్పంతా ర‌క్త‌నాళాల్లో చేరి ర‌క్త‌నాళాల గోడ‌ల‌కు పేరుకుపోతుంది. దీంతో ర‌క్త‌నాళాలు స‌రిగ్గా వ్యాకోచించ‌కక‌ అది క్ర‌మంగా బీపీకి దారి తీస్తుంది.

follow these 3 simple steps for High BP
High BP

క‌నుక ఉప్పును తీసుకోవ‌డం పూర్తిగా త‌గ్గించాలి. అలాగే బీపీని త‌గ్గించ‌డంలో పొటాషియం మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. క‌నుక రోజూ పొటాషియం ఎక్కువ‌గా ఆహారాల‌ను తీసుకోవాలి. బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఇత‌ర అల్పాహారాల‌ను తీసుకోకుండా కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పండ్ల‌ల్లో ఉప్పును వాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాగే వీటిలో ఉండే పొటాషియం బీపీని త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇలా 15 రోజుల పాటు తీసుకున్న త‌రువాత ఉద‌యం అల్పాహారంలో పండ్ల‌తో పాటు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను కూడా తీసుకోవాలి. కానీ సాయంత్రం భోజ‌నంలో మాత్రం కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఈ పండ్ల‌ను కూడా సాయంత్రం 7 గంట‌ల లోపే తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన సోడియం బ‌య‌ట‌కు పోతుంది.

ర‌క్త‌నాళాలు వ్యాకోచించే గుణం పెరిగి బీపీ అదుపులోకి వ‌స్తుంది. ఇలా ఆహార నియ‌మాల్లో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బీపీ స‌మ‌స్య నుండి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే రోజూ ఉద‌యం ఒక గంట పాటు వ్యాయామం ఖ‌చ్చితంగా చేయాలి. ఆక్సిజ‌న్ లోప‌లికి ఎక్కువ‌గా వెళ్లేలా వ్యాయామాలు చేయాలి. ఇలా ఆక్సిజ‌న్ లోప‌లికి వెళ్ల‌డం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. అలాగే సాయంత్రం భోజ‌నం చేసిన మ‌రో గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బీపీ అదుపులోకి వ‌స్తుంది. అదే విధంగా ఒత్తిడిని, ఆందోళ‌న వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి త‌గ్గేలా ప్రాణాయామాలు, యోగా వంటి వాటిని చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బీపీ స‌మ‌స్య నుండి క్ర‌మంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అలాగే వీటిని పాటించ‌డం వ‌ల్ల బీపీ రాకుండా ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts