హెల్త్ టిప్స్

మీకు జీవితంలో అస‌లు గుండెపోటు రావొద్దంటే ఇలా చేయండి..!

మనిషి ఆరోగ్యానికి ఇస్తున్నంత విలువ అంతా ఇంతాకాదు. అందునా గుండెపోటుకైతే మరింత విలువ నిచ్చి ఎంతో జాగ్రత్త వహిస్తాం. ఈ గుండెపోటును నివారించుకోవడానికి వైద్యులు సూచించే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. మీ శరీరంలోనున్న కొవ్వు శాతం 130 మి.గ్రా వుండేలా చూసుకోవాలి. మీ లివర్‌లో అత్యధికమైన కొవ్వు చేరిపోతుంటే దానిని తగ్గించుకోవడానికి మందులు వాడాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనెపదార్థాలు లేకుండా జాగ్రత్తపడాలి. కాని మసాలాలను మాత్రం నియంత్రించకండి. నూనె లేని ఆహారాన్నిమాత్రమే తీసుకోండి.

నూనె వలన ఆహారపదార్థాలలో రుచి కాస్త పెరుగుతుందనేది వాస్తవం. కాని ఆ నూనె ఆరోగ్యానికి హాని తలపెడుతుందనడంలో సందేహంలేదు. మీకున్న ఒత్తిడులు, సమస్యలను కనీసం 50 శాతం తగ్గించండి. ఇలా చేస్తే మీలోనున్న గుండెపోటును నివారించడానికి ఆస్కారం కలుగుతుంది. ఎందుకంటే మానసిక సమస్యలే గుండెపోటుకు మూల కారణం. కాబట్టి ఆలోచనలను దూరంగావుంచితే ఆరోగ్యంగా వుండొచ్చనేది వైద్యుల అభిప్రాయం. సాధారణంగా మీ బీపీ 120/80 గా వుండాలి. పెరిగిన బీపీ అయితే 130/90వుంటే మాత్రం అధికమైన ఒత్తిడివుంటుంది. శారీరక మానసికమైన ఒత్తిడిని ధాన్యం ద్వారా తగ్గించవచ్చు, ఆహారంలో ఉప్పు అతి తక్కువగా తీసుకోవాలి. అలాగే తక్కువ మందులతోనూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

follow these tips to prevent heart attack

మీ బరువును సమంగావుంచుకోండి. మీ బాడీ మాస్ ఇండెక్స్( బీఎమ్ఐ) 25 కన్నా తక్కువగానే వుండాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనె లేకుండా, కాయగూరల సలాడ్‌లు ఉండేలా చూడండి. దీంతో బరువును నియంత్రించుకోవచ్చని వైద్యులు తెలిపారు. ప్రతిరోజు కనీసం అరగంటపాటు తేలికపాటి వ్యాయామం, అలాగే నడకను కూడా కొనసాగించాలి. ఆయాసపడేంతవరకు వ్యాయామాన్ని చేయకూడదు. దీంతో మీ గుండెపై భారం పడొచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తే హెచ్‌డీ‌ఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Admin

Recent Posts