హెల్త్ టిప్స్

ఈ కాలంలో వ‌చ్చే రోగాల నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే ఇలా చేయండి..!

ఈ కాలంలో సహజంగా కొన్ని వ్యాధులు వచ్చి అనారోగ్యం కలుగుతుంది. వేస‌వి ప్రారంభం మొద‌లు చాలా మందికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఈ వ్యాధులనుండి రక్షించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. ఎండ‌లు ఇంకా ఎపుడు పెరిగేది తెలియదు. అందువ‌ల్ల మ‌నం కూడా ఆరోగ్యం ప‌రంగా ముందుగానే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులను నివారించుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టటానికి అందరూ పాటించదగిన అయిదు మార్గాలు దిగువ ఇవ్వబడుతున్నాయి. పరిశీలించి ఆచరించటానికి ప్రయత్నించండి. హెర్బల్ టీ లో సహజసిద్ధమైన ఆరోగ్య దినుసులు మిరియాలు, లవంగం, జింజర్, టీ ఆకులు, మింట్, తులసి, అశ్వగంధ‌ మొదలైనవి వుంటాయి.

ఇవన్ని సహజంగా చల్లదనాన్ని దగ్గర చేరనీయవు. దగ్గు, జలుబులకు మంచి నివారణ. గొంతు శరీరంలో చల్లదనాన్ని త్వరగా గ్రహించే ఒక భాగం. ఈ కాలంలో ఉదయం వేళలో ఒ హెర్బల్ టీ తాగితే గొంతు సంబంధిత బాధలు రాకుండా వుంటాయి. ముక్కు కారుతుంటే, మీ కర్చీఫ్ లో నాలుగు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రోజంతా దానిని వాసన చూస్తుండండి. ఘాటైన దీని వాసన మీ శ్వాసను హాయిగా వుంచుతుంది. ఈ ఆయిల్ ప్రతి మందుల షాపులోను లభిస్తుంది. వేపను ఉపయోగించండి. వేప చెట్టులో కావలసినన్ని ఔషధ గుణాలుంటాయి. ఈ కాలంలో ఎలర్జీ కలుగకుండా వాడచ్చు. మరిగే వేడి నీటిలో వేపాకులు వేసి దాని ఆవిరి పీల్చండి. ఇది సాధ్యం కాకపోతే, వేప నూనె సబ్బులు వాడండి.

follow these wonderful health tips to prevent diseases in this season

ఇది చర్య వ్యాధుల నుండి సహజ రక్షణ కల్పిస్తుంది. కాళ్ళు సరిగా శుభ్రం చేసుకోండి. కాళ్ళు బురద, మట్టి మొదలైన వాటికి గురవుతాయి. దీనిలోని బాక్టీరియా సరిగా శుభ్రం చేయకపోతే శరీరానికి వ్యాపిస్తుంది. జబ్బు పడకూడదనుకుంటే, ఈ కాలంలో కాళ్ళను వీలైనంత పరిశుభ్రంగా వుంచుకోవాలి. వీలైతే వేడి నీటిలో కాళ్ళను కనీసం అయిదు నిమిషాలు నానపెట్టి తర్వాత సబ్బుతో శుభ్రం చేయండి. వేడి నీరు తాగండి: ఈ కాలంలో తాగే నీరు పొట్ట సంబంధిత వ్యాధులను తెస్తుంది. కనుక ఈ వ్యాధులనుండి రక్షణ పొందాలంటే కాచి చల్లార్చిన నీరు తాగాల్సిందే. నీటిని కనీసం 10 నిమిషాలు మరగించండి మరిగేటపుడు కాసిని తులసి ఆకులు కూడా వేయండి. ఈ చర్యలను పాటించి ఈ కాల వ్యాధులనుండి రక్షణ పొందండి.

Admin

Recent Posts