హెల్త్ టిప్స్

బ‌ద్ద‌కంగా ఉందా.. ఏ ప‌ని చేయాల‌నిపించ‌డం లేదా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

బద్దకం.. అంత త్వరగా వదలిపెట్టని జబ్బు. మనల్ని గెలవనీయకుండా మనలోని శక్తిని చిదిమేసి, ముందుకు వెళ్ళనీకుండా చేసే రోగం. చిన్న పనికే అలసిపోవడం, అంతకుమించి చేయడానికి ఇష్టపడకపోవడం, మొదలగు విషయాలన్నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవు. అందుకే జీవితంలో గెలవాలంటే బద్దకాన్ని, అలసటని దూరం చేసుకోవాలి. బద్దకాన్ని, అలసటని పోగొట్టి కుతూహలాన్ని పెంపొందించే మార్గాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ఉదయం లేవగానే రెండు ఖర్జూర పండ్లు, 3 లేదా 4 నల్లటి ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటిలో ఉన్న ఐరన్, శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ ని పెంచుతుంది.

రెండు లవంగాలు, యాలకులు, లేదా సోపు గింజలు తీసుకుని వాటికి బెల్లం కలుపుకుని తినడం మంచిది. దీనివల్ల నిద్రమత్తు ఫీలింగ్ దూరమై బద్దకం మననుండి దూరంగా పారిపోతుంది. అంతే కాదు రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. పొద్దున్న లేవగానే కాఫీ తాగవద్దు. కాఫీలో ఉన్న కెఫైన్ వెంటనే ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ టెంపరరీ మాత్రమే. అంతే గాక ప్రతీసారీ తాగాలనిపించేలా చేస్తుంది. జీవక్రియ సరిగ్గా పనిచేయాలంటే కాఫీకి దూరంగా ఉండాలి. శరీరానికి కావాల్సినన్ని నీళ్లు క‌చ్చితంగా తాగాలి. రోజులో కనీసం ఆరు గ్లాసుల నీరైనా తాగాలి. లేదంటే శరీరం తొందరగా అలసటకి గురవుతుంది.

follow these wonderful health tips to reduce laziness

రాత్రి పూట ఫోన్ ని తీసి పక్కన పెట్టేయండి. ఫ్యామిలీతో గడపండి. కుటుంబంతో గడుపితే కొత్త ఎనర్జీ వస్తుంది. ఫోన్ వాడడం వల్ల అందులోని నీలికాంతి కళ్ళపై పడటం వల్ల తొందరగా అలసిపోతారు. బద్దకాన్ని పోగొట్టుకుని జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే ఈ పద్దతులు పాటించండి మరి.

Admin

Recent Posts