Liver : మన శరీరంలోని అనేక అవయవాల్లో లివర్ ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందజేస్తుంది. ఇలా లివర్ అనేక పనులను చేస్తుంది. అయితే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పాటించే జీవనశైలి కారణంగా లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక లివర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. అయితే వీటికి బదులుగా తేనెను కూడా వాడవచ్చు. ఇవన్నీ డిటాక్స్ పదార్థాలు. శరీరంలో ఉండే కొవ్వు, వ్యర్థాలను బయటకు పంపుతాయి. కనుక లివర్‌లో ఉండే వ్యర్థాలు, కొవ్వు కూడా బయటకు పోతాయి. కాబట్టి వీటిని రోజూ తాగుతుండాలి.
ఇక ఉదయం, సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీని తాగుతుండాలి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక గ్రీన్ టీని రోజూ తాగాల్సి ఉంటుంది.
రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో లేదా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగాలి. ఇది కూడా అద్భుతమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీంతో లివర్ లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్‌లోని కొవ్వు కూడా కరుగుతుంది.
విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, కివీ, నిమ్మ, పైనాపిల్, బొప్పాయి, దానిమ్మ, జామ పండ్లను అధికంగా తింటుంటే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. తిరిగి యథావిధిగా పనిచేస్తుంది. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.