అధిక బరువు తగ్గించుకోటానికిగాను తాజాగా చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి.ఎంతోమంది బరువు తగ్గించుకోడానికిగాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అంశంపై కొన్ని తాజా అధ్యయనాలు చూడండి. బాగా నమలండి – మీరు తినే ఆహారాలను బాగా నమలాలి. ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం. ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి. అనేది దీని సారాంశం.
నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది. ఎంత బాగా నమిలితే అది మీ బరువు తగ్గేందుకు అంత బాగా సహకరిస్తుంది. ఎక్కువ సమయం నమిలితే మీ బ్రెయిన్ పొట్టనుండి ఆహారం కావాలి అంటూ సిగ్నల్స్ తీసుకోటానికి కూడా అధిక సమయం పడుతుందట.
బ్లాక్ టీ మేజిక్ – టీలో ధియాఫ్లావిన్స్ మరియు ధియా రూబిగిన్స్ అనే రెండు పదార్ధాలు కొవ్వును కరిగించటానికి బాగా పనిచేస్తాయట. అయితే దీనిలో పాలు కలిపితే ఆ రెండు పదార్ధాల సామర్ధ్యం పోతుందట. కనుక పాలు కలుపకుండా తాగితే టీలో బరువు తగ్గే పదార్ధాలు బాగా పని చేస్తాయట. అంతేకాదు, బ్లాక్ టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఎంతో అలర్ట్ గా వుంచుతూ గుండె జబ్బుల వంటివాటిని దగ్గరకు చేరనివ్వవని కూడా చెపుతున్నారు.