నిద్ర మనకు చాలా అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ తగినంత సమయం పాటు నిద్రపోతే మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేసేందుకు కావల్సిన కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతోపాటు శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. ఫలితంగా పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం నిద్ర పోవడం ఎలా, నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి ? అన్న సూచనలు కాదు. నిద్రను ఎలా ఆపుకోవాలి, అన్న దాని గురించే కింద ట్రిక్ తెలియజేస్తున్నాం. దాన్ని పాటిస్తే ఎంతటి గాఢ నిద్రనైనా ఇట్టే ఆపుకోవచ్చు. అదెలాగంటే…
చలికాలంలో మనం ఎక్కువగా వాడే వాజెలైన్ గురించి మీకు తెలుసు కదా. అదేనండీ.. కొందరు దీన్ని పెట్రోలియం జెల్లీ అని కూడా పిలుస్తారు. అయితే దీన్ని మీ కనురెప్పలపై రాయాలి. కండ్ల పై భాగంలో ఉండే కంటి రెప్పులపై వాజెలైన్‌ను రాయాల్సి ఉంటుంది. దీంతో మీకు నిద్ర రాదు. ఎంతటి గాఢ నిద్ర వస్తున్నా.. దాన్ని సులభంగా ఆపుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
వాజెలైన్ సహజంగానే మన చర్మం మీద రాస్తే అది మన చర్మానికి తేమను అందిస్తుంది కదా. అలాగే కంటి రెప్పలపై రాస్తే కళ్లలో తేమ అలాగే ఉంటుంది. కళ్లలో తేమ ఉన్నంత వరకు అవి పొడి బారవు. తేమగానే ఉంటాయి. ఫలితంగా మెదడుకు ఆ సిగ్నల్స్ అందుతాయి. దీంతో మెదడు నిద్ర రాకుండా చేస్తుంది. ఇలా ఎంతటి గాఢ నిద్రనైనా ఆపుకోవచ్చు. అదే వాజెలైన్ లేకపోతే మన కళ్లు పొడిబారతాయి. ఆ సిగ్నల్స్ మెదడుకు చేరుతాయి. దీంతో మెదడు నిద్ర పోవాలన్నట్టుగా మనకు ఆవులింతల రూపంలో సంకేతాలను ఇస్తుంది. లేదంటే నిద్ర బాగా వచ్చేట్టు చేస్తుంది. కనుక ఇకపై మీకు రాత్రి పూట పని ఉన్నా, చదువుకోవాలనుకున్నా వాజెలైన్ ట్రిక్ పాటించి చూడండి. దీంతో మీకు నిద్ర రాదు గాక రాదు. ఎంచక్కా పనిచేసుకోవచ్చు..!