Foods For Liver Health : మన శరీరంలో ఉండే అతి ముక్యమైన అవయవాల్లో కాలేయం కూడా కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో కొన్ని వందల రకాల విధులను నిర్వర్తిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే రసాయనాలను, పురుగు మందులను బయటకు పంపించడంలో, కార్బైడ్ యొక్క హానిని తొలగించడంలో, మనం వాడే మందుల్లో ఉండే రసాయనాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ది చేసి వ్యర్థాలను బయటకు పంపించడంలో, శరీరాన్ని శుభ్రపరచడంలో ఇలా అనేక విధులను కాలేయం నిర్వర్తిస్తూ ఉంటుంది. కనుక మనం కాలేయం యొక్క ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించుకుంటూ ఉండాలి.
కాలేయం ఆరోగ్యం దెబ్బతింటే మనం తీవ్ర అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం కాలేయానికి మేలు చేసే ఆహారాలను, కాలేయ పనితీరును మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. కాలేయానికి హానిని కలిగించే ఆహారాలను వీలైనంత దూరంగా ఉండాలి. మనలో చాలా మంది కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే మద్యపానం కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కనుక వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవకాడో పండ్లు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిలో గ్లూటాథియోన్ ఎక్కవు మోతాదులో ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించేలా చేయడంలో కూడా ఎంతో దోహదపడుతుంది.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు అవకాడోను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి మనకు డ్రై రూపంలో కూడా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. వ్యర్థాలు ఏ రోజుకు ఆ రోజు బయటకు పంపించబడతాయి. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు జామకాయ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల జామపండులో 200 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. మన శరీరంలో ఎంత ఎక్కువగా విటమిన్ సి ఉంటే కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ అంత సమర్థవంతంగా జరుగుతుంది.
ఉడికించిన ఆహారాల్లో విటమిన్ సి ఉండదు. జామకాయలు మనకు దాదాపు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటాయి. కనుక రోజుకు ఒక జామకాయను తప్పకుండా తీసుకోవాలి. అదే విధంగా స్టార్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో 8 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియను చక్కగా నిర్వర్తించేలా చేయడంలో దోహదపడతాయి. అదే విధంగా బ్లాక్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ ను తీసుకోవడం వల్ల కూడా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో రస్వట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయంలో డిటాక్సిఫికేసన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కాలేయం జీవితకాలం పాటు ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుందని తన విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.