Foods For Uric Acid Levels : ప్రస్తుత కాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. మన శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. దీనిని మూత్రపిండాలు శరీరం నుండి బయటకు పంపిస్తాయి. కానీ మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, షుగర్, మద్యపానం వంటి వివిధ కారణాల చేత చాలా మంది యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. దీనిని మూత్రపిండాలు బయటకు పంపించలేకపోతున్నాయి. దీంతో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఇలా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల గౌట్, కీళ్ల నొప్పులు, జాయింట్ నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచే ఆహరాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో యూరిక్ స్థాయిలను తగ్గించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూరిక్ స్థాయిలను అదుపులో ఉంచడంలో చెర్రీలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. చెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడంతో పాటు నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో టమాటాలు కూడా మనకు సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది.
అదే విధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారు డార్క్ చాక్లెట్ ను ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో లిథోబ్రోమైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి అందేలా చూసుకోవాలి. నారింజ పండ్లతో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ స్థాయిలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.