Foods For Weight Loss : బరువు తగ్గడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. వాకింగ్, వ్యాయామం, డైటింగ్, యోగా, జిమ్ కి వెళ్లడం ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొందరు 3 నుండి 4 నెలల్లోనే బరువు తగ్గుతారు. కొందరు 6 నుండి 7 నెల్లలో బరువు తగ్గుతారు. కొందరు మాత్రం ఎంత కష్టపడినా కూడా బరువు తగ్గరు. ఇలా వెంటనే బరువు తగ్గకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. శరీరంలో జీవక్రియల వేగం తక్కువగా ఉండడం వల్ల కూడా మనం బరువు తగ్గము. బరువు తగ్గకపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియనే జీవక్రియ అని చెప్పవచ్చు. మనం చేసే ప్రతి పనికి కూడా శక్తి అవసరం. జీవక్రియ వేగంగా ఉండడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి.
దీంతో మనం వేగంగా బరువు తగ్గుతాము. అదే జీవక్రియ వేగం తక్కువగా ఉంటే మన శరీరంలో క్యాలరీలు తక్కువగా ఖర్చు అవుతాయి. దీంతో మనం కష్టపడినప్పటికి నెమ్మదిగా బరువు తగ్గుతాము. బరువు తగ్గాలనుకునే వారు మన శరీరంలో జీవక్రియల రేటు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనం కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో జీవక్రియ రేటును మెరుగుపరుచుకోవచ్చు. శరీరంలో జీవక్రియను మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవక్రియను మెరుగుపరచడంలో మిరపకాయలు ఎంతో సహాయపడతాయి. మిరపకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది.
క్యాలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. అలాగే శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచడంలో గ్రీన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు గ్రీన్ టీని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగి మనం సులభంగా బరువు తగ్గుతాము. అలాగే రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అదే విధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. చిక్కుళ్లు, బీన్స్, రాజ్మా, చికెన్, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు గింజలు, పల్లీలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది.
దీంతో జీవక్రియల వేగం పెరుగుతుంది. అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వ్యాయామం చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అలాగే ఓట్స్ ను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. ఓట్స్ ను ఏదో ఒకరూపంలో తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగి క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దీంతో మనం సులభంగా వేగంగా బరువు తగ్గవచ్చు.