అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

అధిక బ‌రువు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం.. స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. వీటితో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బరువు కార‌ణంగా డ‌యాబెటిస్, హార్ట్ ఎటాక్ లు వ‌స్తున్నాయి. అధిక బ‌రువు, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానంతో చాలా మందికి అధిక బ‌రువు స‌మ‌స్య వ‌స్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు, స‌రిగ్గా నిద్ర‌పోక‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల అధిక బ‌రువు వ‌స్తోంది. ఇక జీర్ణ స‌మ‌స్య‌లు కూడా చాలా మందికి వివిధ కార‌ణాల వ‌ల్ల వ‌స్తున్నాయి.

అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు, జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గేందుకు ఈ ఒక్క డ్రింక్‌ను రోజూ తాగితే చాలు.. త‌ప్ప‌క ఫలితం ఉంటుంది. అల్లం, నిమ్మ‌ర‌సం డ్రింక్‌ను కింద తెలిపిన విధంగా త‌యారు చేసుకుని తాగితే.. దాంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

కొద్దిగా అల్లంను తీసుకుని దంచి దాన్ని ఒక పాత్ర‌లో నీటిలో వేసి మ‌రిగించాలి. 10 నిమిషాల పాటు మ‌రిగించాక ఆ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. గోరు వెచ్చ‌గా ఉండ‌గానే ఈ అల్లం, నిమ్మ‌ర‌సం టీని తాగాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తాగ‌వ‌చ్చు.

పైన తెలిపిన విధంగా అల్లం, నిమ్మ‌ర‌సం టీని తయారు చేసుకుని తాగితే.. శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ త‌గ్గుతాయి. రాత్రి నిద్ర‌కు ముందు కూడా దీన్ని తాగ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts