హెల్త్ టిప్స్

అల్లంతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లాన్ని త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. అల్లాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వాస్త‌వానికి అల్లం వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి పలు వ్యాధుల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లంను ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు టీస్పూన్ల అల్లం రసం, రెండు టీస్పూన్ల తేనె, రెండు టీస్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ త‌గ్గుతుంది. అంతేకాకుండా గుండె దడ, తల తిప్పడం, తలనొప్పి, అలసట తగ్గుతాయి. రెండు టీస్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు, తరచుగా జలుబు, తుమ్ములు రావడం, దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది.

ginger can get rid of so many health problems

అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం త‌గ్గుతుంది. తరచుగా, అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

తులసి ఆకులు, పసుపు, అల్లం రసంతో నూరి దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు మొదలైనవాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి. ఆముదంలో అల్లం రసం కలిపి చర్మానికి రాస్తే వివిధ చర్మ వ్యాధులు తగ్గుతాయి.

Admin

Recent Posts