తాగేందుకు మనకు రక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా ఉన్నాయి. వీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏ టీ మంచిది ? దేని వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే..
గ్రీన్ టీ కొన్నిసార్లు తేయాకులను బట్టి గ్రీన్ లేదా యెల్లో లేదా లైట్ బ్రౌన్ రంగులో ఉంటుంది. బ్లాక్ టీ డార్క్ బ్రౌన్ రంగులో ఉంటుంది.
అధిక బరువును తగ్గించడంలో గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ బాగానే పనిచేస్తాయి. కానీ యాంటీ ఆక్సిడెంట్ల విషయానికి వస్తే గ్రీన్ టీలోనే అవి ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రీన్ టీ తాగడం వల్ల బరువు ఎక్కువగా తగ్గుతారు.
గ్రీన్ టీ రుచి కొంచెం చేదుగా ఉంటుంది. బ్లాక్ టీ డికాషన్ కనుక టీ టేస్ట్ వస్తుంది.
ఒక కప్పు గ్రీన్‌టీలో కెఫీన్ 25 మిల్లీగ్రాములు ఉంటుంది. అదే బ్లాక్ టీ అయితే 47 మిల్లీగ్రాములు ఉంటుంది. కెఫీన్ ఎక్కువగా ఉంటుంది కనుక బ్లాక్ టీని రోజుకు ఒక కప్పు వరకు తాగవచ్చు. గ్రీన్ టీని రెండు కప్పుల వరకు తాగవచ్చు.
ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలో రెండు టీలు బాగానే పనిచేస్తాయి. రెండూ మంచివే. కానీ యాంటీ ఆక్సిడెంట్ల పరంగా గ్రీన్ టీ పైచేయి సాధిస్తుంది. కనుక బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీ ఎంతో మేలైదని చెప్పవచ్చు. అలాగని బ్లాక్ టీ మంచిది కాదని కాదు. కానీ దాన్ని రోజూ ఒక కప్పు మోతాదు వరకు తీసుకోవచ్చు. అయితే ఆరోగ్యకర ప్రయోజనాలు మాత్రం గ్రీన్ టీతోనే ఎక్కువగా కలుగుతాయి.