Guava Side Effects : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామపండ్లు కూడా ఒకటి. జామపండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే జామపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తపోటును తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా జామపండ్లు మనకు దోహదపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా జామపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే జామపండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని లేదంటే మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జామపండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రక్టోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి రెండు కూడా గ్యాస్, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అలాగే జామపండును తిన్న వెంటనే నిద్రించడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో జామపండు కూడా ఒకటి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్ కారణంగా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే ఇరిటబుల్ బౌల్ ఇండ్రోమ్ ఉన్న వారు జామపండ్లను తీసుకోవడం వల్ల సమ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు జామపండ్లను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల జామపండ్లల్లో 9 గ్రాముల సహజ చక్కెరలు ఉంటాయి. కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కనుక షుగర్ వ్యాధితొ బాధపడే వారు జామపండ్లు తక్కువగా తీసుకోవాలి. అలాగే జామపండ్లను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత లేదా రాత్రి భోజనానికి మధ్యలో తీసుకోవాలి. లేదంటే వ్యాయామంచేసిన తరువాత లేదా చేయడానికి ముందు తీసుకోవాలి. కానీ రాత్రి పూట మాత్రం జామపండ్లను తీసుకో కూడదు. రాత్రిపూట తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రావడంతో పాటు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. జామపండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని అప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.