Hair Fall In Summer : మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. బలమైన సూర్యకాంతి, చెమట, నీటిని తాగకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో జుట్టు రాలడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం చేసే తప్పులు కూడా వేసవికాలంలో జుట్టు ఎక్కువగా రాలేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో జుట్టు ఎక్కువగా రాలడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, ఎండలో నిలబడి పని చేయడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.
ఎండలో తిరగడం వల్ల సూర్యరశ్మి నేరుగా జుట్టుపై పడుతుంది. దీంతో జుట్టు కుదుళ్లల్లో ఉండే తేమ తగ్గిపోయి జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. కనుక ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జుట్టుపై నేరుగా సూర్యరశ్మి పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే వేసవి కాలంలో తలలో కూడా చెమట ఎక్కువగా పడుతుంది. చెమట పట్టినప్పటికి రోజూ అందరూ తలస్నానం చేయరు. ఇలా తలస్నానం చేయకపోవడం వల్ల తలలో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. ఇది క్రమంగా చుండ్రు సమస్యకు దారి తీస్తుంది.
తలలో చుండ్రు ఎక్కువగా రావడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కనుక వేసవి కాలంలో రోజూ తలస్నానం చేసే ప్రయత్నం చేయాలి. అలాగే కొందరు వేసవి కాలంలో ఉండే ఉక్కపోత కారణంగా జుట్టును గట్టిగా ముడివేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. జుట్టును గట్టిగా ముడివేయడం వల్ల జుట్టు చెమట చిక్కుకుపోయి తల ఆరక బ్యాక్టీరియా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్లు కూడా బలహీనపడతాయి. అలాగే కొందరు తలను రోజూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు. తలలో చెమటలను కడిగి వేయడానికి తలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. రోజూ తలను శుభ్రం చేసుకోవడం మంచిదే.
అయితే తలను శుభ్రం చేసుకున్న ప్రతిసారి షాంపులను వాడడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. షాంపులల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా జుట్టు ఊడిపోతుంది. కనుక తలస్నానం చేసినప్పుడు ఎక్కువగా సాధారణ నీటితో కడుక్కోవడం మంచిది. చేతివేళ్లతో బాగా రుద్ది సాధారణ నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం చేసే తప్పులే వేసవి కాలంలో జుట్టు ఎక్కువగా రాలడానికి కారణాలవుతాయని కనుక వాటిని సరిదిద్దుకోని జుట్టు సంరక్షించుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.