Health Benefits : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది కీరదోసను తింటుంటారు. అయితే వాస్తవానికి ఇది మనకు అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. కనుక దీన్ని రోజూ తీసుకోవచ్చు. కీరదోసను ఒకటి తీసుకుని జ్యూస్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున ఉదయం లేదా మధ్యాహ్నం తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. కీరదోస జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కీరదోస జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అధికంగా బరువు ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. కనుక దీన్ని రోజూ తాగాలి.
2. కీరదోస జ్యూస్ అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. కనుక దీన్ని రోజూ పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.
3. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
4. కీరదోసలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. దీని వల్ల గాయాలు అయినప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా రక్తం త్వరగా గడ్డకడుతుంది. అలాగే కీరదోసలో ఉండే మెగ్నిషియం మనకు గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
5. కీరదోసలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
6. కీరదోసలో అధిక శాతం నీరే ఉంటుంది. అందువల్ల ఈ జ్యూస్‌ను తాగితే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దీని వల్ల వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. అలాగే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు.