భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి జీలకర్రను వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. రోజూ జీలకర్రను అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల రోజూ జీలకర్ర నీళ్లను పరగడుపున తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలసుకుందాం.
1. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు రోజూ జీలకర్ర నీళ్లను తాగితే ఎంతో మంచిది. దీంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.
2. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు రోజూ జీలకర్ర నీళ్లను తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా రోజూ జీలకర్ర నీళ్లను తాగాలి. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ సమస్య ఉన్నవారు రోజూ ఈ నీళ్లను తాగితే తప్పక ఫలితం ఉంటుంది.
4. జీలకర్రలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. అవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల ఈ నీటిని రోజూ తాగాలి.
5. అధిక బరువు సమస్య ఉన్నవారు రోజూ జీలకర్ర నీళ్లను తాగుతుండాలి. దీంతో శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. లేదా ఒక గ్లాస్ నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగాలి. దీంతో పైన తెలిపిన లాభాలు కలుగుతాయి.