ఖర్జూరాలు అంటే చాలా మంది ఇష్టమే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. సైంటిస్టులు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించి నిర్దారించారు కూడా. కనుక నిత్యం 3 ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకుంటే వాటితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
* నార్త్ డకోటా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలీ గార్డెన్ రాబిన్‌సన్ చేసిన పరిశోధనల ప్రకారం నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిల్లో ఉండే బోరాన్ అనే సమ్మేళనంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీనివల్ల ఎముకలు గుల్లగా మారిపోయే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
* బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్ణం, మలబద్దకం ఉండవు.
* ఖర్జూరాలలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
* తీవ్రంగా అలసిపోయిన వారు, వ్యాయామం చేసిన వారు ఖర్జూరాలను తినడం వల్ల వెంటనే శక్తిని పుంజుకుంటారు. తిరిగి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.
* ఖర్జూరాలను నిత్యం తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే హైబీపీ తగ్గుతుంది.
* నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థలో క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ కు చెందిన సైంటిస్టులు వెల్లడించారు.
* ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. ఇలా ఖర్జూరాలను నిత్యం తినడం వల్ల మనకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.