Black Spot Bananas : అరటి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అరటి పండ్లలో అనేక రకాల వెరైటీ పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన పండ్లలో అరటి పండ్లు ఒకటి అని చెప్పవచ్చు. అరటి పండ్లు బాగా పండితే వాటిపై నల్లని మచ్చలు వస్తాయి. అయితే ఇలా బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల ఇంకా ఎన్నో లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బాగా పండిన అరటి పండ్లలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ (టీఎన్ఎఫ్) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ ట్యూమర్లను నాశనం చేస్తుంది. అందువల్ల బాడా పండిన అరటి పండ్లను తింటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
2. బాగా పండిన అరటి పండ్లు సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తాయి. అజీర్ణాన్ని తగ్గిస్తాయి. పొట్టలో అసౌకర్యంగా ఉన్నవారు, విరేచనాలు అవుతున్న వారు.. బాగా పండిన అరటి పండ్లను తింటే ఆయా సమస్యలు వెంటనే తగ్గుతాయి. అలాగే కడుపులో మంట కూడా తగ్గిపోతుంది.
3. మన శరీరంలో తగినంత పొటాషియం ఉంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. అయితే బాగా పండిన అరటి పండ్లలో సాధారణ పండ్ల కన్నా అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అందువల్ల బాగా పండిన అరటి పండ్లను తింటే బీపీ వెంటనే నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
4. అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది మన శరీరంలో సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
5. మలబద్దకం సమస్యను తగ్గించడంలో బాగా పండిన అరటి పండ్లు ఎంతగానో దోహదపడతాయి. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
6. వ్యాయామాలు చేసేవారు, రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు బాగా పండిన అరటి పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అలసట, నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి.
7. జీర్ణాశయం, పేగుల్లో పుండ్లు, అల్సర్లు ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను తింటుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అల్సర్లు నయమవుతాయి.
8. బాగా పండిన అరటి పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడుతుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్త హీనత సమస్య ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
9. మహిళలు నెల నెలా రుతు సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు బాగా పండిన అరటి పండ్లను తింటుండాలి. వాటిల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది రుతు సమయంలో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తుంది.