Brown Rice : బ్రౌన్‌ రైస్‌ను తినడం లేదా ? అయితే ఈ ప్రయోజనాలను మిస్‌ అయినట్లే..!

Brown Rice : బ్రౌన్‌ రైస్.. ముడి బియ్యం.. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉంటేనే చాలా మంది తింటారు. నిజానికి తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యమే ఆరోగ్యకరమైనవి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక వీటితో వండిన అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి బ్రౌన్‌ రైస్‌ మంచి ఆహారం అని చెప్పవచ్చు.

అధిక బరువుతో బాధపడేవారు రోజూ రెండు పూటలా బ్రౌన్‌ రైస్‌ను తినాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు. పాలిచ్చే తల్లులు బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్‌ రైస్‌ను రోజూ తినాలి. బ్రౌన్‌ రైస్‌ను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు.

health benefits of eating Brown Rice everyday
Brown Rice

బ్రౌన్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ రైస్‌ను తినడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. డిప్రెషన్ తగ్గుతుంది. కనుక ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే బ్రౌన్‌ రైస్‌ను మిస్‌ చేసుకోకుండా తినండి. తెల్ల బియ్యంకు బదులుగా ఈ బ్రౌన్‌ రైస్‌ను తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.

Share
Editor

Recent Posts