Fermented Rice : చద్దన్నంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. వెంటనే తింటారు..!

Fermented Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం అల్పాహారం కింద ఏవేవో జంక్‌ ఫుడ్స్‌ తింటున్నారు. కానీ మన పెద్దలు మాత్రం ఉదయాన్నే చద్దన్నం తినేవారు. దాంతో వారు ఎంతో ఆరోగ్యవంతులుగా, దృఢంగా ఉండేవారు. ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. మనం తింటున్న ఆహారాలే మనకు అనేక వ్యాధులను తెచ్చి పెడుతున్నాయి. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

health benefits of Fermented Rice

ఇక రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం అని నిపుణులు చెబుతున్నారు. ఉదయం తీసుకునే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉంటే అంత మేలు జరుగుతుందని అంటున్నారు. కనుక ఉదయం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి ఆహారాల్లో చద్దన్నం ఒకటని చెప్పవచ్చు.

రాత్రిపూట అన్నం కొద్దిగా ఎక్కువగా వండాలి. అందులో పాలు పోయాలి. అనంతరం తోడు పెట్టాలి. దీంతో రాత్రికి రాత్రి అది పులుస్తుంది. ఉదయం వరకు చద్దన్నంగా మారుతుంది. ఆ అన్నాన్ని రాత్రి మట్టికుండలో ఉంచితే మంచిది. దీంతో ఉదయం వరకు అది ఎంతో రుచికరంగా మారుతుంది. ఇలా చద్దన్నం తయారవుతుంది.

ఇలా తయారైన చద్దన్నాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ రూపంలో తినాలి. అందులో నిమ్మకాయ రసం పిండి.. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో దాన్ని తినవచ్చు. ఇంకా భలే రుచిగా ఉంటుంది. ఈ చద్దన్నాన్ని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు మనకు లభిస్తాయి.

చద్దన్నంలో కార్బొహైడ్రేట్లు, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రోజంతా పనిచేసేందుకు కావల్సిన శక్తి అందుతుంది. నీరసం, నిస్సత్తువ తగ్గి చురుగ్గా ఉంటారు.

చద్దన్నంలో మన జీర్ణవ్యవస్థకు అవసరం అయ్యే మంచి బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.

చద్దన్నాన్ని తినడం వల్ల అల్సర్లు నయం అవుతాయి. జీర్ణాశయం మొత్తం శుభ్రం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

చదన్నంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. రక్తసరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరంలో వేడి బాగా ఉన్నవారు చద్దన్నం తింటే ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా మారుతుంది. వేసవిలో అయితే ఇది ఎంతో మేలు చేస్తుంది.

చద్దన్నాన్ని తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.

Share
Editor

Recent Posts