Benefits Of Matcha Tea : మ‌చా టీ (Matcha tea) తో ఎన్నో లాభాలు.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

Benefits Of Matcha Tea : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల టీ ల‌లో మ‌చా టీ (Matcha tea) ఒక‌టి. దీన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం, ఈ టీని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి తగ్గ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి.

Benefits Of Matcha Tea : మ‌చా టీ (Matcha tea) తో ఎన్నో లాభాలు.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

1. సైంటిస్టుల అధ్య‌య‌నం ప్ర‌కారం, మ‌చా టీలో ఎన్నో ఔష‌ధ విలువలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ టీని తాగితే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మ‌న‌స్సు హాయిగా ఉంటుంది. చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

2. ఈ టీని తాగ‌డం వ‌ల్ల లివ‌ర్‌కు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. లివ‌ర్ లోని ఎంజైమ్ ల ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల లివ‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

3. మ‌చా టీలో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. ఈ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తాగితే బీపీ తగ్గుతుంది.

4. మ‌చా టీని తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది.

5. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్న వారు రోజూ మ‌చా టీని తాగాలి. దీంతో శ‌రీరంలో కొవ్వు క‌ర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. మెట‌బాలిజం పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

Share
Admin

Recent Posts