ఈ రోజుల్లో లో దుస్తులను ధరించని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. లో దుస్తులు మనకు రక్షణను ఇస్తాయి. అందువల్ల కచ్చితంగా వాటిని ధరించి తీరాల్సిందే. అయితే రాత్రి పూట మాత్రం లో దుస్తులను తీసేసి పడుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి పూట లో దుస్తులను తీసి నిద్రించడం వల్ల పలు లాభాలను పొందవచ్చని వారంటున్నారు. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజంతా లో దుస్తులు ధరించడం వల్ల ఆ ప్రాంతానికి గాలి సరిగ్గా తాకదు. కనీసం రాత్రి పూట అయినా లో దుస్తులను తీసేస్తే గాలి సరిగ్గా తగులుతుంది. దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా, ఫంగస్ పెరగదు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు వచ్చే చాన్స్ తగ్గుతుంది.
రాత్రి పూట లోదుస్తులను తీసి నిద్రించడం వల్ల అక్కడ గాలి తగిలి హాయిగా ఉంటుంది. దీంతో త్వరగా నిద్ర వస్తుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక కొందరికి చర్మ వ్యాధులు వస్తుంటాయి. అలాంటి వారు రాత్రి పూట లో దుస్తులను తీసేసి నిద్రిస్తే త్వరగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక రాత్రిపూట లో దుస్తులను తీసి నిద్రించడం వల్ల ఆ ప్రాంతంలో గాలి సరిగ్గా తగులుతుంది. తేమ ఉండదు. దీంతో దురద, దద్దుర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రాత్రి పూట లో దుస్తులను తీసి నిద్రించాల్సి ఉంటుంది.