Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Admin by Admin
June 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన పూర్వీకులు ఏ ఆచారాన్ని మొదలుపెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం కచ్చితంగా ఉంటుంది. పూర్వం పూజ గదిలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని ఉంచేవారట. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం. అయితే కర్పూరం లో మూడు రకాలు ఉన్నాయి. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం. ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య వ్యత్యాసం, పచ్చ కర్పూరం విశిష్టత గురించి తెలుసుకుందాం. పచ్చకర్పూరాన్ని సంస్కృతంలో హిమ కర్పూరం అంటారు. హిమాలయ పర్వతాలల్లో ఉండే వృక్షాల ద్వారా పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు. హిందీలో భీంసేని కర్పూరంగా పిలుస్తారు. పచ్చ కర్పూరం పచ్చగా ఉండదు. తెల్లగా, చిన్నచిన్న బిళ్ళలుగా ఉంటుంది. నిల్వకాలం పెరిగిన తరువాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది.

స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఆవిరైనప్పుడు ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయం అవుతుంది. అదే దాని స్వచ్ఛతకు గుర్తు. హారతి కర్పూరం టర్పంటైన్ లాంటి కెమికల్స్ తో తయారు చేస్తారు. హారతి కర్పూరం తినకూడదు. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఔషధ యోగ్యమైనవి. ఇందులో పచ్చ కర్పూరం శ్రేష్టమైంది. శక్తికలది. మూడు సార్లు బట్టీ పెట్టి కాల్చి తయారు చేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైంది. దీన్ని మనం తినే పదార్ధాల్లో వేసుకున్నా, దేవుడి పూజ గదిలో ఉంచుకున్నా ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందొచ్చు. పచ్చ కర్పూరం అంటే స్వచ్ఛమైందని అర్ధం. తినడానికి అర్హత కలిగిందని అర్ధం. నిజానికి దేవుడి హారతి కూడా ఈ స్వచ్ఛమైన పచ్చ కర్పూరంతోనే ఇవ్వాలి. కానీ ఖర్చుకు భయపడి కెమికల్ తో తయారైన తక్కువ రేటు హారతి కర్పూరంతో హారతి ఇస్తున్నాం. దీని ద్వారా పూజ పవిత్రతే కాదు.. వాతావరణం, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కెమికల్ హారతి కర్పూరం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి.

health benefits of using pacha karpuram

పచ్చకర్పూరం ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే… ప్రతి రోజు పూజ సమయంలో చిన్న కప్పులో రెండు నుంచి మూడు గ్రాముల పచ్చ కర్పూరం వేసి, దాని పైన కొద్దిగా పసుపు జల్లి, దేవుడి ముందు ఉంచాలి. అలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మిదేవి ప్రభావం ఉంటుందని నమ్మకం. వైద్య పరిభాషలో చూస్తే.. ఇది ఒక వైద్య ప్రక్రియ. ప్రతి రోజు దేవుడి ముందు అలా పచ్చ కర్పూరం ఉంచడం వల్ల ఇంట్లో గాలి పవిత్రమవుతుంది. వానాకాలం, చలికాలం గాలి తేమలో హానికారక సూక్ష్మజీవులు ఉంటాయి. పచ్చ కర్పూరం ఆవిరి అయ్యే గాలిలో కలిసి గాలిని శుభ్రం చేస్తుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు శక్తివంతమై, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి పొందుతాయి. ఆరోగ్యం ఉన్న ఇంట్లో.. సంపద చేకూరడం సహజమే కనుక.. మన పెద్దలు ఇలాంటి ఆచారాలను అలవాటు చేశారు.

ఇక శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు బెడ్రూమ్ లో కూడా ఇలా పచ్చకర్పూరాన్ని ఉంచాలి. ఒక మిరియం గింజ సైజు పచ్చ కర్పూరాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తే.. నోటి నుంచి వచ్చే వాసన పారిపోతుంది. సిగరెట్స్, ఆల్కాహాల్ అలవాటు ఉన్నవాళ్లు ఇలా చేస్తే ఆ అలవాట్లు మానే సామర్థ్యం వస్తుంది. జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గుతుంది. అలాగే లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి, కండరాల్లో, నరాల్లో ఉత్తేజం కలుగుతాయి. అందుకే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో పచ్చకర్పూరం కలుపుతారు.

Tags: Pacha Karpuram
Previous Post

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

Next Post

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

Related Posts

హెల్త్ టిప్స్

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

June 9, 2025
హెల్త్ టిప్స్

బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

June 9, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

June 9, 2025
వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!