సాధారణంగా చాలా మంది బంగారం లేదా వెండితో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తుంటారు. అవి విలువైనవి కనుక వాటిని ధరించేందుకే చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఆరోగ్యం పరంగా చెప్పాలంటే మనం రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాలి. రాగితో తయారు చేసే కడియాలు, ఉంగరాలు.. ఇలా రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించడం వల్ల వాటిలో ఉండే రాగి కొద్ది కొద్దిగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
* రాగితో తయారైన ఆభరణాలను ధరిస్తే మన శరీరంలో చేరే రాగి ఇతర మినరల్స్ ను శోషించుకునేందుకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఐరన్, జింక్ శరీరానికి లభిస్తాయి.
* సైంటిస్టులు చెబుతున్న ప్రకారం రాగిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని తొలగించేందుకు రాగి ఉపయోగపడుతుంది. అందువల్ల రాగితో తయారు చేసిన ఆభరణాలను ధరించాలి.
* రాగిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి.
* డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు, నెలసరి సమస్యలు ఉన్న మహిళలు రాగి ఆభరణాలను ధరిస్తే మంచిది.
* రాగి ఆభరణాలను ధరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.