Health Tips : మనిషికి ఏది కావాలో ఏది అవసరమో దేవుడికి బాగా తెలుసు. అందుకే స్త్రీ, పురుషులు అని రెండు రకాల శరీరాలను తయారు చేసి కోరికలను పుట్టించాడు. అయితే శృంగారం గురించి సైన్స్ చెప్పే విషయాలు చూస్తే అవి అన్నీ నిజమేనేమో అనిపిస్తుంది. శృంగార జీవితం వల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేటలు కూడా పొందవచ్చు. మెదడును చురుకుగా ఉంచుకోవడానికి చెస్, పజిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వల్ల కూడా మెదడును చురుకుగా ఉంచుకోవచ్చట.
శృంగారం కారణంగా మెదడులో కొత్త కణాలు వృద్థి చెందుతాయట. అందువల్ల పెద్ద పెద్ద విషయాలను కూడా గుర్తు పెట్టుకునే సామర్థ్యం పెరగడంతో పాటు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించే తెలివితేటలు పెరుగుతాయని సైన్స్ చెబుతుంది. శృంగారం కారణంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. శృంగార సమయంలో మెదడు చురుకుగా ఉండాలంటే ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్స్.. డార్క్ చాక్లెట్స్ ను ఎక్కువగా తినే వారు, తరచూ దాంపత్య సుఖాన్ని అనుభవించే వారిలో మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ చాక్లెట్స్ తిన్నవారిలో అసిటోసిన్ రసాయన స్థాయిలు పెరిగి ఏడు రకాలైన శృంగార మార్పులు సంభవించి వారి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తుందట. ఇక ఈ చాక్లెట్ లో ఉన్న మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి మెదడుకు జరిగే హానిని అడ్డుకుంటాయట. కేవలం డార్క్ చాక్లెట్లు తినడం వల్లనే కాదు చేపలు తినడం వల్ల కూడా సంభోగ సమయంలో మెదడు చురుకుగా పని చేస్తుందట. కాబట్టి మెదడుకు పని పెట్టేందుకు చెస్, సుడోకులతో పాటు శృంగారం పై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.