Ginger Water : మనం తీసుకునేందుకు ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన ఆహారాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిల్లో మనం వేటితో రోజును మొదలుపెట్టబోతున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే ఉదయాన్నే మీరు అనారోగ్యకరమైన ఆహారాలతో కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలతో రోజును మొదలు పెట్టాలి. వాటిల్లో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది.. అల్లం. అవును, అదే. ఇది భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని వంట ఇంటి సామగ్రిగా ఉపయోగిస్తారు. అల్లాన్ని మనం రోజూ అనేక రకాల కూరల్లో, ఇతర వంటల్లో వేస్తుంటాం. అల్లంతో టీ పెట్టుకుని కూడా తాగుతుంటాం. అయితే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయాన్నే అల్లం నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అల్లం మన శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. కనుక రోజూ ఖాళీ కడుపుతో మీరు మీ రోజును అల్లం నీళ్లతో మొదలు పెట్టాల్సి ఉంటుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మీ చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంలో సహజసిద్ధమైన కాంతిని పెంచుతాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. కనుక అల్లం నీళ్లను రోజూ తాగాలి.
స్త్రీలకు పీరియడ్స్ సమయంలో నొప్పులు రావడం సహజం. కానీ కొందరికి అధిక రక్తస్రావం, నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు అల్లం నీళ్లను తాగితే ప్రయోజనం ఉంటుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నవారు రోజూ అల్లం నీళ్లను తాగుతుంటే ప్రయోజనం ఉంటుంది. ఇవి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా తగ్గించగలవు.
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువగా ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ అల్లం నీళ్లను తాగడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా అల్లం నీళ్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక రోజూ వీటిని తాగాలి.