హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జీవిత కాలం పొడిగించడమెలా&quest; ప్రతిరోజూ కొన్ని ఆరోగ్యపు అలవాట్లు ఆచరిస్తే జీవితకాలం పొడిగించవచ్చు&period; ఒక కారు&comma; కొన్న 50 ఏళ్ళకు కూడా కొత్తదిగానే వుండాలంటే&comma; ఎప్పటికపుడు దానికి తగిన మెయిన్టెనెన్స్ చేస్తూ వుండాలి&period; టైర్లు అరిగితే టైర్లు మార్పించాలి&period; ఆయిల్ అవసరమైతే ఆయిల్ మార్పించాలి&period; ఈ రకంగా ఎప్పటికపుడు దాని సర్వీసు చేస్తూ వుంటే తయారీ దారు దాని జీవితకాలం పదిహేను సంవత్సరాలని తెలిపినప్పటికి&comma; మీ సర్వీసు కారణంగా అది అధిక సంవత్సరాలు మన్నుతుంది&period; మరి మీ శరీర విషయంలో కూడా అంతే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరానికి ప్రతిరోజూ పోషణ అవసరం&period; తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవై వుండాలి&period; తగిన వ్యాయామాలు చేయాలి&period; ఆరోగ్యానికి అవసరమైన మంచి గాలి&comma; నీరు&comma; ఆహారం&comma; విసర్జన&comma; విశ్రాంతి&comma; వీటితో పాటు మానవుడిగా పుట్టి ఆలోచనా శక్తి కలిగి వున్నందుకు మంచి ఆలోచనలు కూడా అవసరమే&period; చెడు ఆలోచనలు వుంటే అవి శరీరంలో విషపదార్ధాలను పుట్టించి శరీరం రోగాలబారిని పడేందుకు తోడ్పడతాయి&period; కనుక ఆరోగ్యానికి అవసరమైన గాలి&comma; నీరు&comma; ఆహారం వంటివాటితోపాటు మానవుడికి మంచి ఆలోచనలు కూడా అవసరమే&period; శరీర కణాలకవసరమైన అవసరాలు ప్రతి రోజూ అందించాలి&period; ఆ కణాల పట్ల మీరు శ్రధ్ధ వహించకపోతే&comma; అవి చెడిపోయి మీ వయసు ప్రక్రియను వేగవంతం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87247 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;life-1&period;jpg" alt&equals;"here it is how you can increase your life span " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ శరీర కణాలన్నింటిని మంచి మార్గంలో ప్రయాణింపజేసే భాధ్యత మీదే&period; మీరు డ్రైవర్ సీటులో కూర్చున్నారు&period; మీరు నడిపే శరీర వాహనం స్లో చేయాలన్నా&comma; వేగిరం చేయాలన్నా మీ చేతులలోనే వుంది&period; అనారోగ్య చర్యలతోను&comma; పోషకాహార లేమి వంటివాటితోను కొద్ది రోజులలోనే శరీరాన్ని శుష్కింపజేసి జీవిత కాలాన్ని తగ్గించుకోవచ్చు&period; ఆరోగ్యకర ఆహారాలు&comma; అలవాట్లతో శరీరాన్ని బలంగా వుంచి మీ జీవితకాలం పొడిగించుకోవచ్చు&period; ఏది చేసినా మీ వద్ద వున్న 24 గంటలలోనే చేయగలరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts